అయినను పోయిరావలే అంటున్న సమంత..!

327
samantha
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ 2021జనవరిలో థియేటర్ల ముందుకు రానుంది. ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఇటివలే చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయినను పోయిరావాలే హస్తినకు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమాలో తొలుత రష్మికాను హీరోయిన్‌గా అనుకున్న తాజాగా అందుతున్న టీ టౌన్ వర్గాల సమాచారం మేరకు సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు చేసింది సమంత. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో సమంతను ఎంపిక చేసినట్లు టాక్.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.

- Advertisement -