బౌలర్‌కి స్వేచ్ఛ నివ్వడంలో ధోనికి సాటిలేరు..!

264
dhoni harbhajan singh
- Advertisement -

బౌలర్లకు స్వేచ్ఛ నివ్వడంలో మహేంద్రసింగ్ ధోనికి ఎవరు సాటిరారని కొనియాడాడు హర్భజన్ సింగ్. ఐపీఎల్‌లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న భజ్జి…ఓ మ్యాచ్ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని వివరించాడు. బౌలర్‌ వద్ద ఎలాంటి ఆప్షన్స్ లేవని అతనికి తెలిస్తే తప్పకుండా సాయం చేస్తాడని వెల్లడించాడు.

పుణె వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ పేలవ బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. ఓ ఒవర్‌లో తొలి రెండు బంతులకే 4, 6 ఇచ్చాడు. దీంతో తాను ధోనీ వద్దకి వెళ్లి.. శార్ధూల్‌కి సలహా ఇవ్వచ్చు కదా లేదా యాంగిల్ మార్చమని సూచించడం చేయచ్చు కదా..? అని అడిగానని కానీ ధోని చెప్పిన సమాధానం విని షాకయ్యానని చెప్పాడు.

ఈ పరిస్ధితుల్లో తాను ఏదైనా చెబితే బౌలర్ మరింత కన్‌ప్యూజ్ అవుతాడు. అతని వద్ద ఎలాంటి బౌలింగ్ వ్యూహాలు లేవు నాకు అనిపించినప్పడు నేను ప్లాన్స్ చెప్తాను అని ధోని అన్నాడని వెల్లడించాడు హర్భజన్. ధోనీ అలా చెయ్.. ఇలా చెయ్ అని చెప్పి విసిగించే కెప్టెన్ కాదని కొనియాడాడు భజ్జీ.

- Advertisement -