తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు 50 కోట్ల సినిమా అంటే గొప్ప విషయం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా బడ్జెట్ వ్యయం వందల కోట్లు దాటిపోతోంది. అయితే గతంలో హీరోలు లీడ్ రోల్ లో నటించిన సినిమాలకే ప్రాధాన్యముండేది. కానీ ఇప్పుడు హీరోయిన్‌లు కూడా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలకు కూడా డిమాండ్ బాగానే ఉంటోంది. దానికి ఉదాహరణ అనుష్క నటించిన అరుంధతి, భాగమతి, నయనతార నటించిన కోలమావు కోకిల వంటి చిత్రాలే హీరోయిన్‌ల రేంజ్‌ను మరింత పెంచుతున్నాయి. దీంతో అనుష్క, సమంత, తమన్నా, నయనతార వంటి వారు కూడా కథానాయిక ప్రాధాన్యమున్న మూవీస్‌లోనే నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీ ఏ రేంజ్‌లో హిట్‌ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. అటు సమంత కూడా తను నటించిన సినిమాల్లో మంచి రోల్ లో నటిస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇటీవల సమంత నటించిన 14 చిత్రాలు అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అంటే హీరోలకే కాక హీరోయిన్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం అర్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన రంగస్థలం, మహానటి సినిమాలకు అమెరికాలో బాగానే వర్కవుట్ అయింది. ఈ రెండు సినిమాల్లో నటించిన సమంతకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ భామ నటించిన యూ టర్న్ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొడుతుందని అంచనా వేస్తున్నారు. సమంత దూకుడు ఈ సినిమాకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజవుతోంది. అంటే .. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీమియర్ల సందడి మొదలవుతుంది. వినాయక చవితి సెలవుల్ని సామ్ యూటర్న్ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు. చూడాలి మరి సమంత నటన ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో.