నా వ‌ల్లే వాళ్లిద్ద‌రికి గొడ‌వ‌లు

254
Supriya

అక్కినేని సుప్రియ‌… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు.. అక్కినేని ఫ్యామిలీలో మెంబ‌ర్ గానే కాదు.. అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్వ‌హ‌ణ క‌ర్త‌గా ఆమె అంద‌రికి సుప‌రిచిత‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా నటించిన సుప్రియ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ వ్య‌వ‌హారాల్లో మునిగిపోయారు. అయితే ఈవిడ తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించింది. అదేంటంటే సినిమా ఇండ‌స్ట్రీలో దిగ్గ‌జాలైన అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు, దాస‌రి నారాయ‌ణ రావుల మ‌ద్య గొడ‌వ‌ల‌కు తాను కూడా ఓ కార‌ణ‌మ‌ని ఓ బాంబ్ పేల్చింది.

Supriya

అంతే కాకుండా త‌నకు కొంచెం గ‌ర్వం ఎక్కువ‌ని దీంతో దాస‌రి నారాయ‌ణ‌రావు, అక్కినేని నాగేశ్వ‌ర్‌రావుల మ‌ద్య విభేదాలు రావ‌డానికి కార‌ణం తానేనని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఓ ప్ర‌ముఖ టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న షోలో సుప్రియ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సమయంలో కొన్ని బిల్లుల విషయంలో సుప్రియ కఠినంగా వ్యవహరించాన‌ని,.. అది దాసరి- అక్కినేని మధ్య విభేదాల్ని పెంచటమే కాదు.. చివరకు ఒకే సభకు హాజరైనా ముఖముఖాలు చూసుకోవటానికి కూడా ఇష్టపడే వారు కాదన్న ప్రచారం జరిగింద‌ని సుప్రియ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ గొడవలు ఎంతవరకూ వెళ్లాయంటే.. దాసరి సతీమణి మరణించినప్పుడు కనీసం ఫోన్లో పరామర్శ కూడా అక్కినేని కానీ ఆయన వారసులు ఎవరూ చేయలేదన్న టాక్ ఉంది.

Supriya

అయితే ఒక‌సారి దాస‌రి నారాయ‌ణ రావు తో అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని, అందుకోసం రాత్రి 12 గంటల సమయంలో తాను దాసరి ఇంటికి వెళ్లినట్లుగా చెప్పారు. లోపలకు వెళ్లిన తర్వాత ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయానని.. వచ్చావా:.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనమరాలంటే ఆ మాత్రం పొగరుండాలిలే.. కూర్చో అంటూ వ్యాఖ్యానించటమే కాదు.. ఏం తింటావని అడిగారని.. ఆయన తన సమస్యను పరిష్కరించినట్లుగా చెప్పుకొచ్చారు సుప్రియ‌.