ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు స్లాట్ ఫిక్సయింది. జనవరి నెలంతా సంక్రాంతి సినిమాలదే రాజ్యం. ఇక అందుకే శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో కొన్ని సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 17న ధనుష్ ‘సార్’ తో పాటు కిరణ్ అబ్బవరం ‘వినారో భాగ్యము విష్ణు కథ’ , విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబందించి రిలీజ్ డేట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.
కానీ ఉన్నపాలంగా అదే డేట్ కి ఇప్పుడు సమంత శాకుంతలం ఎనౌన్స్ చేశారు. సమంత ప్రెస్టీజియస్ మూవీ గా గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు దిల్ రాజు కూడా ఓ నిర్మాత. మూడు సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసిన ఫిబ్రవరి 17 నే దిల్ రాజు శాకుంతలం ను థియేటర్స్ లోకి తీసుకురావలనే నిర్ణయం తీసుకొని ఎనౌన్స్ చేయడం మిగతా నిర్మాతలను ఇబ్బంది పెడుతుంది.
ఏదేమైనా సమంత సినిమా వస్తే మాత్రం ఈ మూడు సినిమాలపై ఎఫెక్ట్ గట్టిగా ఉండనుంది. మరి శాకుంతలం దెబ్బకి వీటిలో ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయా ? చూడాలి.
ఇవి కూడా చదవండి..