ఫిబ్రవరి 10న అమిగోస్..

54
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ డ్రామా సినిమా ‘బింబిసారా’. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, అదే జోష్ ని కంటిన్యు చేస్తూ ‘అమిగోస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఎంటర్ప్రెన్యూర్’ సిద్దార్థ్ ‘అమిగోస్’ వరల్డ్ లో ఒక లుక్ ఏ లైక్ క్యారెక్టర్ అంటూ మేకర్స్ ఆ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘అమిగోస్’ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సాఫ్ట్ వేర్ మంజునాథ్ గా కనిపించనున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ ను కూడా చేయబోతుంది. ఈ నెల 24వ తేదీన సారథి స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ సాంగ్ ను కంపోజ్ చేయబోతున్నాడు.

అన్నట్టు ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ మార్కెట్ కూడా ఆధార పడి ఉంది. ఈ సినిమా కూడా హిట్ ఆయి 50 కోట్ల మార్క్ ను దాటితే.. కళ్యాణ్ రామ్ స్థాయి రెట్టింపు అయినట్టే. మిడ్ రేంజ్ హీరో స్థాయి నుంచి పైమెట్టుకు ఎదిగినట్టే. మరీ వైవిధ్యమైన సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ను కొడతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -