అది కేవలం అపోహ మాత్రమే-సమంత..!

321
- Advertisement -

పెళ్ళైన తర్వాత కూడా సమంత హవా ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, పెళ్ళైన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిందనడం లో అతిశయోక్తి లేదు. రంగస్థలం లో రామలక్ష్మిగా తనలోని పల్లెటూరి చిలిపితనాన్ని చూపించి కుర్రకారుని తన కొంగుకి చుట్టుకున్న సమంత, మహానటి సినిమాలో ఓ భయస్థురాలైన న్యూస్ పేపర్ రిపోర్టర్ గా అద్భుతంగా నటించి సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.

samantha reacted about actress career after marriage

ప్రస్తుతం ఆమె నటించిన “యూ టర్న్ “, “సీమదురై చిత్రాలు” విదుదలకు సిద్ధంగా ఉన్నాయ్. పెళ్ళైన తర్వాత కూడా ఓ హీరోయిన్ ఇలా రాణించడం చాలా తక్కువ. హీరోలు 5 పదుల వయస్సు దాటినా కొనసాగుతారు కానీ, హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లకే పేకప్ చెప్పేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం పై ఓ ఇంటర్వ్యూ లో ప్రస్తావించిన సమంత అది కేవలం ఓ అపోహ మాత్రమేనని కొట్టిపారేసింది.

samantha reacted about actress career after marriage

హీరోయిన్లు కూడా ఇండస్ట్రీ లో రాణించగలరని, అది వాళ్ళు పెళ్ళైన తర్వాత తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది సమంత, అయితే పెళ్ళైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు రావు అని కొందరు సినిమావాళ్లు ప్రచారం చేస్తున్నారని, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే పెళ్ళైన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగిన హీరోయిన్లు ఉన్నారని చెప్పింది. తను ఎప్పటికీ ఇలాగే సినిమాల్లో కొనసాగుతానని, తను ఎలాంటి క్యారెక్టర్స్ చేయలేదో చూసుకుని,అలాంటివాటిని కూడా నటించి తనలోని పూర్తి స్థాయి నటిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పింది.

ఏది ఏమైనా నటనపై అంకితభావంతో పనిచేసే సమంత లాంటి నటీమణులు చాలా అరుదుగా దొరుకుతారనే చెప్పాలి.

- Advertisement -