నవాబ్ ట్రైలర్‌..మణి మ్యాజిక్‌ అదుర్స్‌..

198
Nawab Trailer

ఎన్నో అద్భుతమై సినిమాలని అందించిన ఫేమస్ డైరక్టర్ మణిరత్నం ఇప్పుడు ‘నవాబ్’ తో వస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తో మణి..మ్యాజిక్‌ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ ని ఈ రోజు రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఉత్కంఠభరిత సన్నివేశాలతో నవాబ్ ట్రైలర్ అదుర్స్‌ అనిపించేలా ఉంది. ఇక ఈ సినిమాతో డైరక్టర్ మణిరత్న మరో థ్రిల్ ఇవ్వనున్నారని ఫ్యాన్స్‌ ఆసక్తితో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

 Nawab Trailer

తమిళంలోనూ ఈ సినిమాను చెక్కా చివంతా వనమ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఈ ఏడాది జనవరిలోనే నవాబ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జూన్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇటీవల సెర్బియాలో ఫైనల్ షాట్స్ తీశారు.

మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదర్, జయసుధ, అరుణ్ విజయ్‌లు నటిస్తున్నారు.

NAWAB | Official Trailer - Telugu | Mani Ratnam | Lyca Productions | Madras Talkies