బాలకృష్ణుడికి సమంత అప్పిచ్చిందా?

289
samantha
- Advertisement -

బానాకాత్తాడి అనే తమిళ చిత్రంతో నటిగా తెరపైకి వచ్చిన సమంత ఆ తరువాత ఏమాయ చేశావే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సినిమా సాధించిన విజయం సమంతకు నటిగా ఉన్నత స్థానాన్ని అందించింది. ఆ తరువాత నటిగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఈ బ్యూటీకి లేకపోయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్‌ హీరోలతో జత కట్టి స్టార్‌ ఇమేజ్‌ను అందుకున్నారు. ఈ మధ్యనే నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలైన సమంత పెళ్లి తరువాత కూడా తన లైఫ్ ను ఏ మాత్రం మార్చుకోకుండా కంటిన్యూ చేసేస్తోంది. ఇక ఎప్పటిలానే అమ్మడికి భారీ రెమ్యునేషన్ లు కూడా అందుతున్నాయి. అయితే సమంత ఇప్పుడు రెమ్యునరేషన్ కోసం వర్క్ చేయాల్సిన పని ఏమి లేదు. అక్కినేని కోడలంటే ఇక హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయడమే. కానీ సమంత మాత్రం అలా కాకుండా తను సంపాదిస్తోన్న దాంట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది.

Samantha-

రీసెంట్ గా ఈ అక్కినేని కోడలు తన మేనేజర్ కి కూడా హెల్ప్ చేసిందట. మహేందర్ అనే వ్యక్తి ఎప్పటినుంచో సౌత్ లో సమంత దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య ఆయన కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. రీసెంట్ గా నారా రోహిత్ తో కలిసి బాలకృష్ణుడు అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి కొద్దీ రోజులే సమయం ఉండడంతో ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్ లో కాస్త డబ్బు లేక ట్రబుల్ అయ్యారట. దీంతో సమంత ఫైనాన్షియల్ గా 3 కోట్ల వరకు హెల్ప్ చేసిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి ఆ మేనేజర్‌ కారణంగా.. సమంతకు దాదాపు 10 సినిమాలు వచ్చాయట. సమంత స్థాయి ప్రకారం ఒక్కో మూవికి కోటిన్నర రూపాయల కోటి రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు.

samantha

ఇలాంటి సమయంలో ఒకవేళ మూవీ రిలీజ్ కోసం తనకు చేతనైన సాయం చేసినా.. అందుకు బదులుగా సినిమా రైట్స్ ను దగ్గర పెట్టేసుకోవడం లాంటి డీల్స్ చేసుకుంటుందా అంటే అనుమానమే. తనంతట తనే బోలెడంత మందికి అడక్కపోయినా సాయం చేసే సమంత.. తన కెరీర్ కు హెల్ప్ చేసిన వ్యక్తికి ఓ రేంజ్ లో సాయం చేసినా.. బయటకు చెప్పే అవకాశాలు బాగా తక్కువే.

- Advertisement -