చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత సేవలను వినియోగించుకుంటామని టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ స్పష్టం చేశారు. సమాచార సమన్వయ లోప కారణంగా జరిగిన సినీ నటి సమంతా చేనేత బ్రాండ్ అంబాసిండర్ కాదంటూ వచ్చిన వార్తలపైన డైరెక్టర్ స్పందించారు. స్వఛ్చందంగా చేనేత కోసం ముందుకు వచ్చిన సమంతా సేవలను వాడుకోనున్నట్లు అమె తెలిపారు.
సూమారు నెల రోజుల క్రితం చేనేత రంగ అభివృద్ది, చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం తీసుకుని వచ్చేందుకు సమంతా ముందుకు రావడాన్ని స్వాగతించిన కేటీఆర్ తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారని తెలిపారు. చేనేత వస్త్రాలంటే తనకు ఇష్టమని.. అందుకే టెస్కోతో కలిసి స్వచ్ఛందంగా చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిస్తానని ఆమె చెప్పారన్నారు. ఈ కారణంగానే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించినట్లు తెలిపారు. దీనికనుగుణంగానే సమంత ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పలు చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను, ప్రాంతాలను కూడా సందర్శించారని తెలిపారు.
తెలంగాణలోని పలు చేనేత వస్ర్త తయారీ ప్రాంతాలను సందర్శించి, పరిస్ధితులపైన అధ్యాయనం చేశారన్నారు. ఈ మేరకు చేనేత వస్ర్తాలకు ప్రాచుర్యం తెచ్చేందుకు, డిజైనింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో తనకున్న అలోచనలు అమె తమతో పంచుకున్నారని, తర్వలోనే అధికారికంగా సమంతాతో ఒక అవగాహణ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అమె తెలిపారు.