యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ 2021జనవరిలో థియేటర్ల ముందుకు రానుంది. ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇటివలే చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయినను పోయిరావాలే హస్తినకు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఈమూవీలో ఎన్టీఆర్ కు జోడిగా రష్మీక మందన నటించనుందని వార్తలు వస్తున్నాయి.
రష్మిక మందన నటించిన సినిమాలు మంచి విజయం సాధిస్తుండటంతో త్రివిక్రమ్ ఆమెపై మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. కానీ తాజాగా ఉన్న సమాచారం మేరకు ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేశారని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత మూడు సినిమాలు చేసింది. అ..ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయం సాధించాయి. ఎన్టీఆర్ సమంతలు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. రభస, రామయ్య వస్తావయ్యా, బృందావనం, జనతా గ్యారేజ్ అనే చిత్రాలు చేసింది. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం 2021 సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.