సామ్ ఎమోషనల్‌..6 నెలలు ఎలా!

37
- Advertisement -

సమంత ఈ పేరు వింటే గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. ఎందుకంటే అతి తక్కువ కాలంలో గాడ్‌ఫాదర్‌ లేకుండా ఎదిగి నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇటీవలె ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఒక సంవత్సరం వరకు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని, ఇంకా బాధపడుతుందని, త్వరలోనే అమెరికాకు ఈ చికిత్స కోసం సమంత వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read:శరీరం చల్లబడాలంటే..!

తాజాగా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది సమంత. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఆమె త్వరగా కోలుకొని రావాలని, మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి!

- Advertisement -