- Advertisement -
నిన్న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు (శనివారం) సమంత, చైతూకి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.
సమంత, నాగచైతన్యల పెళ్లికి హాజరవుతోన్న వారు వారిద్దరితో ఫొటోలు దిగి తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. వివాహ వేడుకలో క్రిస్టియన్ సంప్రదాయానికి తగ్గట్టుగా వివాహానికి మేలిముసుగు తెలుపు రంగు దుస్తుల్లో ఏంజెల్లా మెరిసిపోయింది.
సామ్ చిరునవ్వులు చిందిస్తూ హుషారుగా కనపడుతోంది. అయితే, నిన్న చూపించినంత ఉత్సాహం మాత్రం ఈ రోజు సమంతలో లేదు. ఇదిలా ఉండగా..సమంత, చైతూ ఉంగరాలు మార్చుకున్న ఫొటోలను నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
.
- Advertisement -