సమంతకు ఆ బాలీవుడ్‌ హీరోతో చేయాలనుందట..!

51
sam

టాలీవుడ్‌, కోలీవుడ్‌ భాషల్లో సమంతకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. అక్కడ ఇక్కడా కూడా తిరుగులేని విజయాలను అందుకుంది. వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా నాయిక ప్రధానమైన కథలకు ప్రాముఖ్యతను ఇస్తోంది. అలా త్వరలో ఆమె ‘శాకుంతలం’ చేయనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది.

ఇక బాలీవుడ్‌లో సమంత మొదటి సారి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో సమంత నెగటివ్ రోల్ లో అది కాకుండా ఉగ్రవాదిగా సమంత కనిపించబోతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌తో సమంత మరింతగా వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.

ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్య్వూలో మాట్లాడిన సామ్‌కు గతంలో హిందీ సినిమాలు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న ఇటీవల ఎదురైంది. “భయం వల్లనే చేయలేదు .. అక్కడ నెగ్గుకు రావాలంటే మరింత ప్రతిభ అవసరం అనిపించింది” అని చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే ఏ హీరో జోడీగా చేయాలనుంది? అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘రణ్ బీర్ కపూర్’ పేరు చెప్పింది.