సమంతతో డీజే టిల్లు…!

25
- Advertisement -

డీజే టిల్లుతో మంచి పాపులర్‌ సంపాదించుకున్న సిద్దూ జొన్నలగడ్డ. అలాగే ఎలాంటి పాత్రలోనైనా ఎదిగిఒదిగి నటించే తత్వం సమంత. అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

డీజే టిల్లు2తో బిజీగా ఉన్న సిద్దూ ఖుషితో సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరూ కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కు నందినీరెడ్డి దర్శకత్వంలో రానుంది. సమంత నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రెండు సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read: హ్యాపీ బర్త్ డే..ఛార్మి

ప్రస్తుతం సమంత ఖుషి షెడ్యూల్ బిజీగా ఉన్నారు. సిద్దూ డీజే టిల్లు2తో బిజీగా ఉన్నారు. అలాగే నందినీ రెడ్డి అన్నీ మంచి శకునములే సినిమా ప్రమోషన్‌తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యక ఈ ప్రాజెక్ట్‌ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Also Read: శర్వానంద్ వెడ్డింగ్ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -