హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’తో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సామజవరగమన ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మల్టీప్లెక్స్‌లోని ఫుడ్ కోర్ట్‌లో శ్రీవిష్ణు అకౌంట్ లో రెబా మోనికా జాన్, ఆమె కుటుంబం జంబో పాప్‌కార్న్ బకెట్లను తీసుకెళ్తున్న హిలేరియస్ సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీ విష్ణు పేరు బాలు. అతను అక్కడ బాక్సాఫీస్ వద్ద పనిచేస్తాడు. శ్రీవిష్ణు, రెబాల ఆలోచనా విధానం వేరు. శ్రీవిష్ణు ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడిలా ఆలోచిస్తూ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుండగా, రెబా అతనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఈ కుర్రాడు రెబాతో ప్రయాణంలో తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడనేది కథ.
రామ్ అబ్బరాజు సామజవరగమనతో మరోసారి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో తన నైపుణ్యాన్ని చూపించాడు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా చూసుకున్నాడు. శ్రీవిష్ణు నటన చాలా సహజంగా ఉంది. తన కామిక్ టైమింగ్ తో నవ్వించారు శ్రీ విష్ణు. రెబా మోనికా జాన్ అందంగా కనిపించింది. నరేష్ అండ్ గ్యాంగ్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొత్తంమీద, ట్రైలర్ సామజవరగమన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.
Also Read: డ్రగ్స్ దందాలో తెలుగు నటీమణులు
ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: బ్రీత్ ఇజ్ ఎమోషనల్ థ్రిల్లర్:చిత్ర యూనిట్