కృష్ణజింకల కేసులో దోషిగా తేలి బెయిల్ పై బాలీవుడ్ కండల వీరుడు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. నా బలం, బలహీనత, నా గర్వం, నా సంతోషం, నా జీవితం, నా ప్రపంచం అన్నీ నీవే అంటూ ట్వీట్ చేశారు. నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా, నీవు ఇంకా ప్రశాంతమైన జీవితం గడపాలని, నిన్ను చూసి ఓర్వలేని వారి దృష్టి నీపై పడకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది.
1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు న్యాయస్థానం ఐదేళ్ల జైలు విధించిన సంగతి తెలిసిందే, ఈ కేసులో సల్మాన్ రెండు రోజుల రైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్‌పై బయటికి వచ్చారు. సల్మాన్ బయటికి రావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సల్మాన్ జైలుకు వెళ్లడంతో ఆయన హీరోగా చేస్తున్న సినిమా నిర్మాతలు దిక్కుతోచని అయోమయంలో పడ్డారు. తాజాగా ఆయన బయటికి రావడంతో సినిమా నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.
సల్మాన్ హీరోగా ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘కిక్ 2’ సినిమాలు తెరకెక్కనున్నాయి. ఆయన ‘రేస్ 3’ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ హీరోగా తాజా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సల్మాన్ త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొననున్నట్లు సమాచారం.