పోలీసుల లాఠీఛార్జ్‌పై సల్మాన్

3
- Advertisement -

ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారడం తన్ను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లాఠీఛార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రశ్నపత్రాల లీకేజీ అనేది చాలా తీవ్రమైన సమస్య అని, మన విద్యా వ్యవస్థను బాగుచేసుకోవడానికి విద్యార్థులందరూ ఏకమవ్వడం, వారికి తల్లిదండ్రులు మద్దతుగా నిలవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మాత్రమే సంబంధించినది. దీనిని దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని, వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థుల పోరాటానికి బాలీవుడ్ నుండి కూడా మద్దతు లభించడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

- Advertisement -