ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా కేటీఆర్

3
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో పేపర్ లీకులకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా నిలిచింది బీఆర్ఎస్. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలను నిరసిస్తూ, వారికి సంఘీభావంగా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రేపు ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్యాచరణ అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొననున్నారు. పేపర్ లీకులపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని BRSV డిమాండ్ చేస్తోంది.

ఢిల్లీలో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై జరిగిన దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగాలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును లాఠీలతో అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

రేపు ఉదయం ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ఈ ధర్నాకు విద్యార్థులు, యువత, బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని BRSV నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -