ఆ హీరోకి అన్నీ దాసోహమే.. పెళ్లి తప్ప

61
- Advertisement -

సల్మాన్ ఖాన్.. ఈ పేరు తెలియని భారతీయుడు లేడు. ఇండియన్ స్టార్ గా స్టేటస్ సంపాదించుకున్న హీరో సల్మాన్ ఖాన్. నార్త్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ డమ్ సాధించిన స్టార్ హీరోగా కూడా సల్మాన్ కి గుర్తింపు ఉంది.సల్మాన్ ఖాన్ మొదటి నుంచి ప్రతేకమే. హీరోగా వచ్చిన కొత్తల్లో అమితాబ్ లాంటి స్టార్ హీరోల నీడలో తాను మొక్కై చెట్టుగా ఎదగగలడా?, కెరీర్ మొదట్లో సల్మాన్ ఖాన్ మదిలో మెదిలిన మొదటి ప్రశ్న అట ఇది. అందుకే.. తన మార్క్ కోసం సల్మాన్ పరితప్పించాడు. ఇందులో భాగంగానే గ్రౌండ్ లెవెల్ నుంచి హీరోయిజమ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయింది. బాలీవుడ్ లో ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో ఎక్కువమంది సల్మాన్ ఖాన్ కే ఉన్నారు. ఇప్పుడు వారందరూ బాధ పడుతున్నారు.

తమ అభిమాన కథానాయకుడి వారసుడు ఎప్పుడు వస్తాడు ? అంటూ బాలీవుడ్ మీడియాలో సల్మాన్ ఫ్యాన్స్ చర్చ పెట్టారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు ?, గత 30 ఏళ్లుగా ఈ ప్రశ్న హిందీ ప్రేక్షకుల మధ్యన వైరల్ అవుతూనే ఉంది. పైగా సల్మాన్ ఖాన్ పెళ్లి పై వచ్చినన్నీ పుకార్లు మరో బాలీవుడ్ హీరో పై రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో సల్మాన్ ఖాన్ పెళ్లి పై వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ తో సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకమైన బంధం ఉంది. కత్రినా కైఫ్ తో అయితే చాలా ఏళ్ళపాటు ఆ బంధం నడిచింది. కానీ ఆమెకు మరొకరితో పెళ్ళి అయింది.

అందుకేనేమో ఈ మధ్య సల్మాన్ ఖాన్ కి ఆయన బంధువుల అమ్మాయితో పెళ్లి అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ, అందులో నిజం లేదని తేలింది. మరి ఇంతకీ సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు?, సల్మాన్ ఖాన్ వయసు ప్రస్తుతం 57 సంవత్సరాలు. మరీ ఈ ఏడాది అయినా సల్మాన్ ఖాన్ పెళ్లి కబురు చెబుతాడా ?, చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు ఆయన అభిమానులు. అయినా సల్మాన్ ఖాన్ కి రికార్డులు, రివార్డులు దాసోహం అయ్యాయి గానీ, పెళ్లి కావడం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -