ఏంటి తమన్నా.. అలా దొరికేసింది..

80
- Advertisement -

సినిమా సెలెబ్రిటీలపై ఇటు మీడియాలో కానీ.. అటు సోషల్‌మీడియాలో కానీ ఏదైనా వార్త వస్తే… సహజంగానే వీక్షకుల్లో కానీ.. అటు అభిమానుల్లో కానీ తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి జనాలు ఉత్సాహం చూపిస్తుంటారు. నటీనటులపై రూమర్స్‌ రావడం, వాటిని వారు ఖండించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ నటిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై ఆ నటి స్పందించకపోవడమే ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యం తనపై వచ్చే వార్తలపై వెంటనే కస్సుమని లేచే ఆ నటి ఇప్పుడు తనపై, తన పెళ్లిపై ఇంతలా ప్రచారం జరుగుతున్న ఉలుకుపలుకులేకుండా ఉండడం పట్ల.. నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇంతకు ఆ నటి ఎవరు అని అనుకుంటున్నారా?… అదేనండి మిల్క్‌ బ్యూటీ తమన్నా… ఇటీవల ఈ అమ్మడిపై సోషల్‌ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని. నటుడు విజయ్‌ వర్మతో లవ్‌లో ఉందని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ విపరీతంగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇది నిజమేమో అన్నట్లుగా తమన్నా, విజయ్‌ వర్మలు పోటోలకు పోజులిస్తూ…దిగిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్స్‌ అనుమానాలన్ని నిజం చేస్తూ.. తమన్నా.. విజయ్‌ వర్మలు తమ న్యూఇయర్‌ వెకెషన్స్‌ ను ముగించుకుని ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. అయితే తనపై వస్తున్నవార్తలపై తమన్నా మాట్లాడుతుందని.. ఒకవేళ తమపై వస్తున్న వార్తలు రూమర్స్‌ అయితే ఖండిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. తమన్నా వాటిపై స్పందించకుండా లైట్‌ తీసుకోవడంతో ఇప్పుడు నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు… నిప్పులేనిదే పొగ వస్తుందా.. ఇద్దరి మద్యలో ఏదో ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తమన్నా, విజయ్‌ వర్మల మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలపై అటు తమన్నా కానీ..ఇటు విజయ్‌ వర్మ కానీ నోరువిప్పి అసలు సంగతిచెబితే గానీ తెలియదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి 

బాలయ్యపై శృతి షాకింగ్‌ కామెంట్స్‌

పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీలీల?

అందాలతో మత్తెక్కిస్తున్న ప్రగ్యాజైస్వాల్‌

- Advertisement -