సల్మాన్‌ `బిగ్‌బాస్’ టీజ‌ర్..

197
Salman Khan is his usual self in Bigg Boss 11 teaser
- Advertisement -

ఒక‌వైపు తెలుగు, త‌మిళంలో బిగ్ బాస్ ఫీవర్ న‌డుస్తుండ‌గా ఇప్పుడు హిందీలోను ఈ షో తో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్. అక్టోబ‌ర్ 1న క‌ల‌ర్స్ లో ఛానెల్ లో బిగ్ బాస్ 11 కార్య‌క్ర‌మం రెగ్యుల‌ర్ గా ప్ర‌సారం కానుంది. ఈ క్ర‌మంలో ఛానెల్ వారు రీసెంట్ గా ఓ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌ల్మాన్ త‌న దైన స్టైల్ లో రెచ్చిపోయాడు. ప‌లు అంశాల‌కి సంబంధించి వివ‌రించాడు.

Salman Khan is his usual self in Bigg Boss 11 teaser

`బిగ్‌బాస్ 10` రియాలిటీ షో‌లోకి సామాన్యుల‌కు కూడా ప్ర‌వేశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్‌తోనే `బిగ్‌బాస్ 11` ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. టీజ‌ర్‌లో ఇంటి ప‌క్కన‌ నివ‌సించే వాళ్ల‌తో ఎలా మెల‌గాల‌నే విష‌యాన్ని వ్యాఖ్యాత‌ స‌ల్మాన్ ఖాన్ వివ‌రిస్తున్న‌ట్లు చూపించారు.

`ప‌డోసీ (ప‌క్కింటివాళ్లు)` అనే అంశం ఆధారంగా ఈసారి బిగ్‌బాస్ ఇంట్లో సెల‌బ్రిటీలు, సామాన్యులు ప‌క్క‌ప‌క్క ఇళ్ల‌లో నివ‌సించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ టీజ‌ర్‌లో ముఖ్యంగా స‌ల్మాన్ త‌న పెళ్లి గురించి వేసిన జోక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది.

https://youtu.be/4xQ3QaL3pck

- Advertisement -