రాజమౌళితో మూవీ..క్లారిటీ ఇచ్చిన సల్మాన్

25
salman khan

కొద్దిరోజులుగా దర్శకధీరుడ రాజమౌళి – సల్మాన్ ఖాన్‌ సినిమాపై రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా సల్మాన్‌కు రాజమౌళి కలవడంపై గాసిప్స్ మరింత రెట్టింపుకాగా ఈ వార్తలకు పుల్ స్టార్ పెట్టారు సల్మాన్.

పుట్టినరోజు సందర్భంగా ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అందులో రాజమౌళి సినిమాపై స్పందించారు. రాజమౌళితో సినిమా అన్ని ఊహాగానాలని తోసిపుచ్చాడు. తాను ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఎలాంటి సినిమాకూ పని చేయడం లేదని పేర్కొన్నాడు.

ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా, సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 15’ షోకి ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హాజరైంది.