యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బాలయ్య..

28
boyapati

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు సినీ నటుడు బాలయ్య. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య…అఖండ సినిమా విజయవంతం సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామి వారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారని తెలిపారు.

యాదాద్రి ఆలయం ఒక చారిత్రాత్మకం… ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నా…నా ఇష్ట దైవం నరసింహ స్వామి…సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కరోనా, కొత్త వైరస్ మహమ్మారి ల నుంచి ప్రజలను ఆ భగవంతుడు కాపాడాలని కోరుకున్నా అని తెలిపారు.