SalmanKhan:సల్మాన్‌ సినిమాలో బతుకమ్మ పాట..!

77
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు తెలుగు సినిమాలో తెలంగాణ సంస్కృతి యాస ఇనుమడింపజేయటం వల్ల సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయికిసీ కా జాన్‌ సినిమా ఒకటి. ఈద్ సందర్బంగా ఏప్రిల్‌ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. అయితే ఈసినిమాలో మూవీ మేకర్స్‌ 4వ పాటను విడుదల చేశారు. అయితే ఈ నాలుగవ పాట తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ నేపథ్యంలో పాట చిత్రీకరించారు.

లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. భూమిక పూజా హెగ్డే వెంకటేష్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించారు. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిప్రసాద్‌ రవి బస్రూర్ హిమేశ్‌రేష్మియా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్టయిన వీరమ్‌క రీమేక్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

చంద్రబోస్‌కి ‘చిరు’ సత్కారం

సినీ జీవితం పై షాకింగ్ కామెంట్స్

దసరా 1st డే కలెక్షన్స్.. ఇంకెంత రావాలి ?

- Advertisement -