Balagam:అంతర్జాతీయ వేదికపై మన బలగం సినిమా..!

34
- Advertisement -

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా రూపుదిద్దుకుంది. జబర్ధస్త్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకుంది. చిన్న సినిమాగా విడుదలై అనతి కాలంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈసినిమా… లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి దర్శకుడు వేణు, బెస్ట్‌ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీకి ఆచార్య వేణుకు ఈ అవార్డులు దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్ ట్వీట్ చేసింది. దర్శకుడు వేణుకు సినిమాటోగ్రాఫర్‌కు వేణుకు అభినందనలు తెలిపింది. కుటుంబ విలువలు తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమా…ప్రియదర్శి కావ్య కణ్యాణ్‌రామ్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దిల్‌రాజ్‌ ప్రొడెక్షన్స్ పతాకంపై హర్షిత్ హన్షిత నిర్మించగా..మార్చి 3న విడుదలై సూపర్‌ హిట్‌ను అందుకుంది.

ఇవి కూడా చదవండి…

SalmanKhan:సల్మాన్‌ సినిమాలో బతుకమ్మ పాట..!

సినీ జీవితం పై షాకింగ్ కామెంట్స్

దసరా 1st డే కలెక్షన్స్.. ఇంకెంత రావాలి ?

- Advertisement -