కేంద్ర బడ్జెట్‌..ఈసారి డిజిటలే!

106
nirmala
- Advertisement -

దేశంలో కరోనా,ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 31 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను పటిష్ట భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్ హాలులో సీట్లు ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ కోసం లోక్‌సభ ఉ. 11 గంటలకు సమావేశమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ వ‌రుస‌గా నాలుగోసారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టనున్నారు. అయితే క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది. మరోవైపు బడ్జెట్‌ను చూడాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యూనియ‌న్ బ‌డ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపిందించింది. ఈ యూనియ‌న్ బ‌డ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

- Advertisement -