సలార్‌ టీజర్‌ ఎప్పుడంటే….

77
- Advertisement -

ప్రభాస్‌ సాహో, రాధేశ్యామ్‌ వరుస ఫ్లాఫ్‌ల తర్వాత చేస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఆదిలోనే నెట్టింట ట్రోల్స్‌కు అడ్డగా మారింది. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కుతున్న సలార్‌ మూవీకి సంబంధించిన ఓవార్త నెట్టింట వైరల్‌ అయింది. తాజాగా సలార్‌ మూవీ టీజర్‌ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతొంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొంది. అయితే షూటింగ్‌ ప్రారంభమై నెల‌లు గడుస్తున్న చిత్రానికి సంబంధించిన అప‌డేట్‌లు మాత్రం రావ‌డంలేదు. ఈ విష‌యంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేక‌ర్స్‌పై తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్‌ అప్‌డేట్‌ త్వరలోనే రానున్నట్లు టాక్‌. కాగా సలార్‌ టీజర్‌ గ్లింప్స్‌ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అవుట్ అండ్‌ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌ట్రైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో తండ్రి, కొడుకులుగా న‌టించ‌నున్నట్లు టాక్. ప్రభాస్‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుద‌లైన ప్రభాస్ పోస్టర్‌ల‌కు విపరీతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. హోంబ‌లే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది.

- Advertisement -