ప్రిన్స్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే …దీపావళికి సినిమా

49
- Advertisement -

డాక్టర్, డాన్‌ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఏర్పరుచుకున్న శివ కార్తికేయన్‌ తొలిసారి తెలుగులో నటించిన ప్రిన్స్ విడుదలకు సిద్ధంగా ఉందని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు.

ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శాంతి టాకీస్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యదేవ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -