Prabhas:మంత్రి చేతికి ప్రభాస్ ‘సలార్’

23
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘సలార్’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ప్రభాస్ ఓ జీప్‌పై గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా కనిపిస్తోందట. ఆ పాత్రను సర్ ప్రైజ్ గా ఉంచారని.. సినిమా రిలీజ్ రోజు ఈ పాత్ర గురించి తెలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ రోల్ చేసిన హీరోయిన్ ఎవరో చూడాలి.

ఇక హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కానుంది. ఐతే, ఈ సినిమా తమిళనాడు విడుదల హక్కులను రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది కూడా. దీంతో తమిళనాడులో సలార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్య కారణం.. తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలినే స్వయంగా ఈ సినిమాని కొన్నారు కాబట్టి.. ఈ సినిమాకి మెయిన్ ఏరియాల్లో మెయిన్ థియేటర్స్ దొరుకుతాయి.

అలాగే, పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి అద్భుతమైన క్రేజ్ ఉంది. అందుకే అతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం పై ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. అందుకే, సలార్ సినిమా ఓటీటీ హక్కులు భారీ రేట్ కు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.160 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందని టాక్.

Also Read:తల స్నానం, వేడినీటి స్నానం ప్రమాదమా?

- Advertisement -