తల స్నానం, వేడినీటి స్నానం ప్రమాదమా?

48
- Advertisement -

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ స్నానం చేస్తే ఎంతో మేలు. అయితే చాలామంది తలస్నానం చేయడంపై కన్ఫ్యూజన్ కు లోనవుతూ ఉంటారు. తల ఎప్పుడు చేయాలి ? వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి ? ప్రతిరోజూ తలస్నానం చేస్తే ఏమౌతుంది ? ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అయినప్పటికీ కొందరు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు.. మరికొల్మ్దారు వారంలో రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తుంటారు. అయితే ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజూ తలస్నానం చేసే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. .

ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయట. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్న మాట. ఇక ఈ చలికాలంలో ఎక్కువ మంది వేడినీటితోనే స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో నూనె శాతం తగ్గి పొడిబారే ప్రమాదం ఉందట. అలాగే చర్మం కూడా బలహీనమౌతుందట. అందుకే గోరు వెచ్చని నీటితో లేదా చన్నీళ్ళ స్నానమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే తలస్నానం చేయడంలోనూ అలాగే శీతాకాలంలో వేడినీటి స్నానం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే..?

- Advertisement -