నేనసలు పెళ్లే చేసుకోను..సాయి పల్లవి

234
online news portal
- Advertisement -

పెళ్లి చేసుకోను అనే తారల పట్టికలో మరో నటి చేరారు. ఒక పక్క పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి పెను సంచలనానికి కేంద్రబిందువు కాగా. తాజాగా వర్ధమాన నటి సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కారు. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి..తాజాగా తెలుగులో రెండు అవకాశాలను దక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్. అలాగే నాని తో ఓ సినిమా చేయబోతోంది. అయితే సోషల్ మీడిగా ద్వారా ఫ్యాన్స్‌ తో ఇంట్రాక్ట్ అయిన అమ్మడు వారి ప్రశ్నలకు దిమ్మతిరిగే రేంజ్‌లో సమాధానం చెప్పింది.

online news portal

లవ్ మ్యారేజ్ చేసుకుంటారా,,,పెద్దలు కుదిర్చిన వివాహాం చేసుకుంటారా అన్న ప్రశ్నకు,, నేనసలు పెళ్లే చేసుకోనని సంచనల కామెంట్ చేసింది. కారణం ఏంటని వారు అడుగగా,,,జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అంటూ సమాధానం చెప్పారు. అంటే మిగతావాళ్లు వారి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదా అని అడిగితే,,ఏమో అవన్నీ నాకు అనవసరం నా నిర్ణయం అయితే ఇది అంటూ బధులు ఇచ్చింది. తల్లిదండ్రులపై ప్రేమ ఉండడం,,వారిని జాగ్రత్తగా చూసుకోవడం బాగానే,,,మంచి ఉద్దేశమే కానీ,,పెళ్లే చేసుకోననడమే ఫ్యాన్స్‌కు మింగుడు పడడంలేదు. పెళ్లిపై సాయి పల్లవి విముఖత వ్యక్తం చేయడానికి  గల కారణం ఇంకేదైనా ఉంటుందా అని కొంతమంది ఆలోచనలో పడ్డారు. అమ్మడు నిజంగానే పెళ్లి చేసుకోకుండా,,,ఒంటరిగానే మిగిలిపోతుందా అని ఫ్యాన్స్ తికమక పడుతున్నారు. మలయాళ మూవీ ప్రేమమ్ లో అద్బుతమైన నటనతో ప్రేక్షకులు మెప్పించిన ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే అవకాశాలు ఊపందుకుంటున్నాయి.

- Advertisement -