స్క్రీన్‌పై సాయిపల్లవి చలాకీతనం చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తెరపై ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతలా కట్టిపడేస్తాయి. ప్రేమమ్‌తో తెరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ గర్ల్.. అనతి కాలంలోనే అటు తమిళ, మలయాళ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా సినిమాతో ఫిదా చేసింది. అయితే ఇదంతా తెరపైనే. నిజజీవితంలో సాయి పల్లవి ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. అంతేగాదు ఎంసీఏ సినిమా సందర్భంగా నానితో,ఫిదా మూవీ సమయంలో వరుణ్ తేజ్‌తో ఈ భామకు ఘర్షణ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ సాయిపల్లవి మాత్రం నిజంగానే ఫిదా చేసింది. కణం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాజరయ్యేందుకు బయలుదేరిన ఈ ఫిదా బ్యూటీ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో, ఆమె తన అసిస్టెంట్ బైకు ఎక్కి నేరుగా వేదిక వద్దకు చేరుకుంది. అలా, బైకెక్కి సింపుల్‌గా వచ్చేసిన.. హైబ్రీడ్ పిల్లను చూసి అక్కడున్నవాళ్లంతా నోరు వెళ్లబెట్టారు.
ఒక్క సక్సెస్ వస్తేనే.. కళ్లు నెత్తిమీద పెట్టుకుని తిరిగే నటీ నటులు ఉన్న ఈ కాలంలో ఆమెలాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కోల్‌కతాలో ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లిన సాయి పల్లవి.. ఏడు గంటలకు షూటింగ్ అనగా.. ఆరు గంటలకే వచ్చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారట. మొత్తానికి తన నటనతో కాదు తన మంచితనంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది ఈ మలయాళ బ్యూటీ.