సాయిపల్లవి బర్త్ డే..సర్‌ప్రైజ్

25
- Advertisement -

ప్రేమమ్ మూవీతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన భామ సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది. ఫిదా మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణంలో రణబీర్ పక్కన సీతగా నటిస్తోంది సాయిపల్లవి.

ఇక ఇవాళ సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది తండేల్ టీమ్. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చేప‌ల వేట‌కు వెళ్లి అనుకోకుండా దేశ స‌రిహ‌ద్దులు దాటిన ఓ యువ‌కుడు పాకిస్థాన్ సైన్యానికి ఎలా బందీగా చిక్కాడు? పాకిస్థాన్ జైలు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? అనే యధార్థ కథతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. 2024 డిసెంబ‌ర్ 20న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

Also Read:కోవిషీల్డ్.. టీకా వెనక్కి!

- Advertisement -