సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం తెరకెక్కుతన్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా సినిమా ప్రీ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ నెల 28వ తేదీన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నామని పోస్టర్ ద్వారా తెలిపింది. పోస్టర్‌లో అనుపమ లుక్స్ కట్టిపడేశాయి. ఈ సినిమాకు తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.
ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామరావు మాట్లాడుతూ మా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో ఇది 45వ సినిమా. లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్‌గారితో మా బ్యానర్‌లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్‌కి మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.