సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటలీ లో రెండు పాటలు షూటింగ్ జరుపుకున్నారు. ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో యాక్షన్ పార్టు చిత్రీకరిస్తారు. మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా జులై లో షూట్ చేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్, టైటిల్ కి చాలా మంచి స్పందన రావటంతో యూనిట్ సభ్యులు మరింత ఉత్సాహంతో వున్నారు. చిత్ర దర్శకుడు బివిఎస్ రవి జన్మదినోత్సవం సందర్బంగా ఈ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ…. సాయి ధరమ్ తేజ్ కు మా బ్యానర్ కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్ కి మాకు మంచి రిలేషన్ వుంది. జవాన్ స్టోరీ చాలా బాగుంటుంది సాయి ధరమ్ తేజ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీ. ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైం లో చాలా బాగా వచ్చింది. జవాన్ ప్రీలుక్ చాలా బాగుంది అలానే ఇప్పడు విడుదల చేసిన మెదటి లుక్ కూడా చాలా బాగుంది. అని అన్నారు.
దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ… జవాన్ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. దేశానికి జవాన్ ఎంత అవసరమో… ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మనోదైర్యంతో తన బుద్దిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. మా ప్రీలుక్ ఎలా ఆకట్టుకుందో, ఈ మెదటిలుక్ కూడా దాన్ని మించి ఆకట్టుకుంటుంది. అని అన్నారు.
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ…. జవాన్ ప్రాజెక్ట్ విషయంలో మా ధైర్యం మా దిల్ రాజు. ఆయన ముందుండి ఈ ప్రాజెక్ట్ ని స్మూత్ గా కంప్లీట్ చేశారు. దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన కథ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాయిధరమ్‌తేజ్ కి సరిగ్గా సరిపోయే కథ. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవలే ఇటలీ లో అందమైన లోకేషన్స్ లో రెండు పాటలు షూటింగ్ పూర్తిచేసుకున్నాం. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఓ పాటని, శేఖర్ మాస్టర్ ఓ పాటని కొరియోగ్రఫి చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. జూన్ 23నుండి హైదరాబాద్ లో యాక్షన్ పార్ట్ చిత్రికరిస్తాము. మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో కంప్లీట్ చేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేస్తాము. జూన్ 22న దర్శకుడు బివియస్ రవి జన్మదినోత్సవం సంధర్బంగా జవాన్ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేస్తున్నాము. మా దర్శకుడికి జవాన్ చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అని అన్నారు.
నటీనటులు – సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు,కెమెరా మెన్ – కెవి గుహన్,మ్యూజిక్ – తమన్,ఆర్ట్ – బ్రహ్మ కడలి,ఎడిటింగ్ – ఎస్.ఆర్.శేఖర్,సహ రచయితలు – కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి,బ్యానర్ – అరుణాచల్ క్రియేషన్స్,సమర్పణ – దిల్ రాజు,నిర్మాత – కృష్ణ,స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – బివిఎస్ రవి