దుబాయ్‌లో సాహో అంటున్న ప్రభాస్‌..

189
- Advertisement -

బాహుబలి ఘన విజయం తరువాత ప్రభాస్ తదుపరి చిత్రంగా ‘సాహో’ తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఎక్కడా రాజీలేకుండా యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌ వారు 200 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడు గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసి తరువాత షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఇందుకోసం ఈ సినిమా టీమ్ దుబాయ్ బయల్దేరి వెళ్లింది.

Sahoo Team Busy in Dubai

దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా దగ్గర ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు.మరి ఈ షెడ్యూల్‌ను జూలై మొదటి వారంలో మొదలువుతుంది అని తెలిసింది. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ‘కెన్ని బేట్స్’ లొకేషన్లు పరిశీలిస్తునట్లు టాక్. దుబాయి అభూ ధాబి ఇంకా మరికొన్ని యూరోపియన్ దేశాలలో కూడా షూటింగ్ లొకేషన్లు కోసం గాలిస్తున్నారు యాక్షన్ డిపార్ట్మెంట్ టీమ్. అక్కడ ఫేమస్ బుర్జ్ ఖలీఫా లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మిషన్ ఇంపాజిబుల్, స్కై స్క్రాపర్, ఘోస్ట్ ప్రోటోకాల్ లాంటి హాలీవుడ్ సినిమాలలో యాక్షన్ ఎపిసోడ్స్ బుర్జ్ ఖలీఫా లోనే షూట్ చేశారు. అయితే సాహో లో ప్రభాస్ కూడా హాలీవుడ్ హీరోల తరహాలో యాక్షన్ చేయబోతున్నాడు.

యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. సుమారుగా 200 కోట్లు బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు – తమిళ్ – హింది – మలయాళం లో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ ఇంకా ఖరారు కాలేదు.

- Advertisement -