సహస్రచండీయాగంలో పాల్గోన్న స్పీకర్, కేకే

331
chandiyagam
- Advertisement -

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం సహస్రచండీ యాగం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠం అధ్వర్యంలో యాగం చేపట్టారు. ఈ సహస్రచండీ యాగంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్జి , రాజ్యసభ సభ్యులు కేకే.. , ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పలవురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

ఈ నెల 13 వ తేదీ నుంచి 17 తేదీ యాగం జరుగనుంది. నాలుగు రాష్ట్రాల పీఠాధిపతులు సహస్ర చండీ యాగంలో పాల్గోన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభంకాగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు విరామం సయమం కాగా తిరిగి సాయంత్రం 4గంటల నుంచి 7.30గంటల వరకు యాగం జరుగుతుంది. 200 మంది రిత్వికుల చేత యాగం నిర్వహిస్తున్నారు.

- Advertisement -