నైరుతి నిష్క్రమణం…రేపు భారీ వర్షాలు

530
weather report
- Advertisement -

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో తమిళనాడు.ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక,కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి 1.5 నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఏర్పడిందని తెలిపారు. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాజారావు స్పష్టం చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని …దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై అధికంగా ఉంటుందన్నారు.

- Advertisement -