మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సహకార శాఖ ఉద్యోగులు..

159
dayakarrao
- Advertisement -

గ్రామీణాభివృద్ధి శాఖ‌లో స‌హ‌కార శాఖ అధికారుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని కోరుతూ, స‌హ‌కార శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప‌క్షాన ప‌లువురు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంగ‌ళ‌వారం ఆ సంఘం ప్ర‌తినిధులు, రాష్ట్ర స‌హ‌కార శాఖ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసిష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భీం రాజు, ఉపాధ్య‌క్షుడు సంజీవ‌రెడ్డి, ఈగ వెంక‌టేశ్వ‌ర్లు, గంథం శ్రీ‌నివాస‌రావు, నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు క‌లిశారు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పిఆర్ సి ఇచ్చినందుకు మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌తంలో స‌హ‌కార శాఖ నుంచి ప‌లువురు అధికారులు వివిధ హోదాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ‌లో త‌మ సేవ‌ల‌ను అందించారు. ప్ర‌స్తుతం కూడా సేవ‌లు అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వారు తెలిపారు.

- Advertisement -