టాలెంట్ ఉన్నా లక్ లేని డైరెక్టర్ గా మిగిలిపోయాడు సాగర్ కె చంద్ర. మంచి డైరెక్టర్ అని పేరు ఉంది. అతనిలో అందుకు తగ్గ విజన్ కూడా ఉంది. అందుకే తివిక్రమ్ పిలిచి మరీ భీమ్లా నాయక్ సినిమా ఇప్పించాడు. పవన్ తో సినిమా అనగానే ఇంకేం ఉంది ?, పది పదిహేను కోట్ల డైరెక్టర్ అయిపోయినట్టే అని కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే.. భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయి నెలలు గడిచాయి. కానీ, మిడ్ రేంజ్ హీరో నుంచి కూడా సాగర్ కె చంద్ర కి పిలుపు రాలేదు.
హీరో రవితేజ కోసం సాగర్ కె చంద్ర ఓ డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకుని కథ రాశాడు. శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో రవితేజ రైతుగా కనిపిస్తాడు. అయితే, విశాఖ జిల్లాలో వున్న సీలేరు బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగర్ కె చంద్ర రాసిన ఈ కథ రవితేజకు నచ్చలేదు. ఆ తర్వాత కథలో మార్పులు చేర్పులు చేసుకుని.. ఇదే కథను హీరో నితిన్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. కథ మొత్తం విన్న నితిన్ ప్రస్తుతానికి లైన్ అయితే ఓకె చేసాడు.
ఆ లైన్ పట్టుకుని కథను ఇంకా కొత్తగా రాయాల్సిందిగా సాగర్ ను నితిన్ కోరాడు. ప్రస్తుతం నితిన్ కోరుకున్న విధంగా కథను తయారు చేసే పనిలో సాగర్ కె చంద్ర సీరియస్ గా వర్క్ చేస్తన్నారట. ప్రస్తుతం సరైన ప్రాజెక్టు, సరైన హిట్ కోసం చూస్తున్న నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. సాగర్ కె చంద్ర కనుక తన ఫుల్ స్క్రిప్ట్ తో నితిన్ ను మెప్పించగలిగితే. లేదంటే మళ్లీ కథ మొదటికి వస్తుంది.
ఇవి కూడా చదవండి…