సచివాలయ ప్రారంభోత్సవంపై మంత్రి…

52
- Advertisement -

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రంలో ఏర్పాటు చేయలేని విధంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సచివాలయంకు భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. అనంతరం మధ్యాహ్నం సచివాలయంను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ తదితర ప్రముఖులు పాల్గొంటారు.

ఈ నెల 17న సచివాలయం ప్రారంభం అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మంది హాజరయ్యేలా చూడాలన్నారు. జన సమీకరణ కోసం ఈ నెల 13న గ్రేటర్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ భవనంకు 2019 జూన్‌లో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

మండే ఎండలు..సంగటి తీసుకోండి

- Advertisement -