- Advertisement -
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్,టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితర ప్రముఖులు న్యూ ఇయర్ నేపథ్యంలో నిన్న జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. అయితే సచిన్ పార్టీలో టెండూల్కర్ ఓ వెరైటీ గెటప్ లో కనపడ్డాడు. ఈ సందర్భంగా సచిన్ తో కలిసి యువరాజ్ ఓ ఫొటో దిగాడు. ఈ ఫొటోలో సచిన్ సిల్వర్ హాట్ ధరించాడు. ఆ హాట్ కు ఓ విగ్ లాంటిది కూడా ఉంది.
ఇంకా ఈ ఫొటోలో భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నాడు. యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్ కూడా ఎరుపు రంగు టోపీ ధరించి నవ్వులు చిందిస్తుండగా, వారి మధ్యలో నిలబడ్డ సచిన్ కూడా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోను యువరాజ్ సింగ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
- Advertisement -