‘కొడకా కోటేశ్వరరావు’ రిలీజ్‌..!

221
- Advertisement -

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఈ సినిమాలోని ఐదు పాటల ఆడియో ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రంలో ఆరో పాట ‘కొడకా కోటేశ్వరరావు’ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Agnyaathavaasi Kodakaa Koteswar Rao Song released

అన్నట్టుగానే కొన్ని నిమిషాల క్రితం ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’అంటూ ఎంతో హుషారుగా పవన్ పాడారు. ఈ వీడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుథ్, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు ఉన్నారు. పవన్ ఈ పాట పడే దృశ్యంతో పాటు ఈ పాటను చిత్రీకరించిన సన్నివేశాలను పొందుపరిచారు.

https://www.youtube.com/watch?v=0vV36TV0oms

- Advertisement -