బీజేపీలో చేరను…కాంగ్రెస్‌ను వీడను:సచిన్ పైలట్

183
sachin pilot
- Advertisement -

రాజస్ధాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ను పీసీసీ చీఫ్‌ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించింది కాంగ్రెస్‌. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనే దానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. పైలట్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆయన ఖండించారు.

తాను భారతీయ జనతా పార్టీలో చేరబోవడం లేదని స్పష్టం చేసిన సచిన్‌…కాంగ్రెస్ పార్టీని వీడేది లేద‌న్నారు.. తాను పార్టీ నాయకత్వాన్ని ఏనాడు విమర్శించలేద‌ని.. వ్యతిరేకంగా ప‌నిచేసింది కూడా లేద‌ని గుర్తు చేశారు.

ఇక మరోవైపు సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ భేటీకి గైర్హాజరుపై రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని లేని పక్షంలో పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సచిన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -