సచిన్‌ పైలట్‌కు షాక్‌..డిప్యూటీ సీఎం పదవి తొలగింపు

194
sachin pilot
- Advertisement -

రాజస్ధాన్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు పలుమార్లు తిరుగుబాటు నేత,డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది.

పార్టీతో పాటు ప్రభుత్వ పదవుల నుండి తిరుగుబాటు నేత సచిన్‌ను తప్పించింది కాంగ్రెస్‌. ఈ విషయాన్ని వెల్లడించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దపీ్ సూర్జేవాల. సచిన్‌ పైలట్‌ని తొలగించాలని ఎమ్మెల్యేలు అందరూ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సచిన్‌ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్రా పీసీసీ చీఫ్‌గా నియమించినట్లు తెలిపారు. అలాగే సచిన్ పైలట్ వెంట ఉన్న ముగ్గురు మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. నిన్న జరిగిన కాంగ్రెస్‌ఎల్పీ సమావేశంలో 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలిపారు.

- Advertisement -