రైతువేదిక భవనానికి శంకుస్ధాపన చేసిన ఎర్రబెల్లి..

190
errabelli
- Advertisement -

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి సత్యవతి రాథోడ్‌, కలెక్టర్ కె నిఖిలతో కలిసి శంకుస్ధాపన చేసిన అనంతరం మొక్కలు నాటారు ఎర్రబెల్లి.

అనంతరం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు నర్ర అయిలయ్య కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -