బండ్లగణేష్, సచిన్‌ల మధ్య ముదురుతున్న వార్‌..

196
Sachin Joshi Fires on Bandla Ganesh...
- Advertisement -

బండ్ల గణేష్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్‌. అదే లెవల్లో వివాదాల్లో కూడా ఉన్నాడు. బండ్ల గణేష్‌ని నమ్ముకుంటే మోసపోక తప్పదు అని కొందరంటుంటే..నిజానికి నన్నే మోసంచేస్తున్నారంటూ టీవీ ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నాడు గణేష్‌. టాలీవుడ్‌ లో టాప్‌ నిర్మాతగా కొనసాగుతున్న గణేష్‌ పై కొందరు కావాలనే ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారా ? లేక నిజంగానే బండ్లగణేష్‌ తనని నమ్మిన వారిని మోసంచేస్తూ వస్తున్నాడా? అనే అనుమానాలు సినివర్గాల్లో మొదలౌతున్నాయి.

Sachin Joshi Fires on Bandla Ganesh...

అయితే ఇటీవలే బండ్లగణేష్‌ తనకి గిట్టని వారిపై ఆరోపణలు చేస్తున్నట్లు వార్తలొస్తున్న క్రమంలో..ఇప్పుడు మరో వివాదంతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు ఈ బడా ప్రొడ్యూసర్‌. అయితే.. నటుడు సచిన్‌ జోషికి, బండ్ల గణేష్‌ కి పడదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా నిర్మాత బండ్ల గణేష్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటుడు సచిన్‌ జోషిని ఉద్దేశించి వివాదాస్పదంగా ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే.

అయితే సచిన్‌ జోషి తనను చంపమని గ్యాంగ్‌స్టర్‌ నయీంకి చెప్పారని, అతను చనిపోవడంతో సరిపోయిందని బండ్ల గణేశ్‌ ఆరోపించారు. గణేష్‌ వ్యాఖ్యలపై సచిన్‌ జోషి కూడా స్పందించారు. ప్రస్తుతం సచిన్‌ కీలక పాత్రలో నటించిన సినిమా ‘వీడెవడు’. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

Sachin Joshi Fires on Bandla Ganesh...

ఈ సందర్భంగా విలేకరులు బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యల గురించి సచిన్‌ వద్ద ప్రస్థావించగా స్పందించారు. బండ్ల గణేష్‌ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు సచిన్‌. ‘బండ్ల గణేష్‌ మనిషి కాడని, అతనో తోడేలు లాంటివాడని సచిన్ అన్నారు. అంతేకాకుండా ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా అంటూ..ఆగ్రహానికి లోనయ్యారు సచిన్‌ జోషి. ఇదేకాకుండా రూ.27 కోట్ల దాకా బండ్ల గణేష్‌ తనకి ఇవ్వాలని, అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో ప్రొడ్యూస్‌ చేశాం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే అరెస్టు చేయించే పరిస్థితి వచ్చినప్పుడు బండ్ల గణేష్‌ తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని, కోర్టు దగ్గర చూసుకుందాం అనుకున్నాఅని కూడా సచిన్‌ అన్నారు. ‘ఒరేయ్‌ పండు’ సినిమా షూటింగ్‌ సమయంలో బండ్లగణేష్‌ తినడానికి తిండి లేదని తనను అడిగాడని, చివరికి నమ్మించి మోసం చేశాడంటూ సచిన్‌ వెల్లడించారు. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో తనపై ఆరోపణలు చేయడం బండ్ల గణేష్ కి తగదని సచిన్‌ జోషి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బండ్లగణేష్ పై సచిన్‌ స్పందించిన ఈ తీరుకు బండ్లగణేష్ కూడా ఎలా స్పంధిస్తాడో చూడాలి.

- Advertisement -