బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు తన ప్రసంగం లో పొరపాటు దొర్లితే హుందా గా క్షమాపణ చెప్పారు అని గుర్తు చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోందన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు ..ఇద్దరు మహిళా మంత్రులు కూడా కే టీ ఆర్ పై విమర్శలు చేస్తున్నారు అన్నారు.
మహిళా కమిషన్ అతి వేగంగా స్పందించింది..ఎనిమిది నెలలుగా రాష్ట్రం లో మహిళల పై 1800 అత్యాచారాలు జరిగాయన్నారు. రేప్ లు మర్డర్లు నిత్యకృత్యంగా మారాయి ..మహిళల పై ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ కే టీ ఆర్ పొరపాటున మాట్లాడిన మాటల పై అంత వేగంగా స్పందిస్తుందా ? అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళ కమిషన్ చూపిన ఉత్సాహం భాదిత మహిళలను పరామర్శించడంలో ఎందుకు చూపలేకపోయింది ?,ఇద్దరు మహిళ మంత్రులు ఇప్పుడేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నారు అన్నారు. అత్యాచారాల బారిన పడ్డ మహిళలను ఒక్కరి నైనా ఇద్దరు మంత్రులు మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారా ?…మమ్మల్ని అసెంబ్లీ లో సీఎం ,డిప్యూటీ సీఎం అనకూడని మాటలు అంటే ఈ మహిళా కమిషన్ ,మంత్రులు ఎక్కడికి వెళ్లారు ? అన్నారు. కే టీ ఆర్ కు కేసీఆర్ సంస్కారము నేర్పారు కాబట్టే ఆయన క్షమాపణ చెప్పారు ..మరి సీఎం కు ఎవరు సంస్కారం నేర్పినట్టు లేదు ..అందుకే క్షమాపణ చెప్పలేదు అన్నారు.గతంలో ఆసెంబ్లీ సాక్షి గా డీ కే అరుణకు కే టీ ఆర్ తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారు….ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక సీఎం మోసం చేశారు అన్నారు.
Also Read:ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య!