తెలంగాణ అంటే కేసీఆరే:సబితా

4
- Advertisement -

24 సంవత్సరాల కింద కేసీఆర్ BRS పార్టీని ఏర్పాటు చేశారు అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించారు తెలంగాణను సాధించారు..పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపారు..మిషన్ భగీరథ నీళ్లు తాగుతుంటే మనకు కేసీఆర్ గుర్తొస్తారు అన్నారు.

హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటించారు ప్రతి చెట్టులో కెసిఆర్ కనిపిస్తారు..తెలంగాణ లో ఎక్కడ చూసినా కెసిఆర్ కనిపిస్తారు..కేసీఆర్ ఆనవాళ్లు కనబడకుండా చేస్తానని రేవంత్ అంటున్నాడు సూర్య చంద్రులు ఉన్నంత కాలం కెసిఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది అన్నారు. 1200 ఎకరాల్లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివెళ్లాలి…మనం మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి భయమేస్తుంది అన్నారు.

మన మీటింగ్ కి అనేక అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నాడు..ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు..ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది..కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..వచ్చే ఏ ఎన్నిక అయినా బీ ఆర్ ఎస్ పార్టీకి భారీ విజయం అందించాలి అన్నారు.

Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు

- Advertisement -